నాకు కాస్త బ్రేక్ కావాలి..కేటీఆర్
ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నానంటూ ఎక్స్ ఖాతాల కేటీఆర్ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. తనకు కొద్ది రోజుల పాటు ఆరోగ్యం కోసం రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు తనను అంతగా మిస్సవరని సెటైర్లు వేశారు. ప్రతిరోజూ రాజకీయాలపై ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేటీఆర్ విశ్రాంతి అడగడంతో తెలంగాణలో పొలిటికల్ మజా మిస్సవుతుందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

