ఆ టాలీవుడ్ హీరో అంటే ఇష్టం..మిస్ వరల్డ్ సుందరి
మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ నగరం సుందరంగా ముస్తాబయ్యింది. వివిధ దేశాల నుండి విచ్చేసిన సుందరీమణులు పలు చారిత్రక ప్రదేశాలు చూస్తూ, హైదరాబాద్ అందాలకు ముగ్దులవుతున్నారు. అంతేకాదు, టాలీవుడ్ చిత్రాల గురించి కూడా తమ మనసులో మాటను పంచుకున్నారు. తాజాగా జపాన్ సుందరి మిస్ తుమీత టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయి ఆస్కార్ అవార్డు కొట్టిన నాటు నాటు పాటకు ఫిదా అయిపోయిందట. దానిలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, అవకాశం వస్తే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పక్కన నటించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. అలాగే బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, షారుఖ్ అంటే ఇష్టమంది. బ్యూటీ విత్ పర్పస్ ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న ఆమె తాను ప్రకృతి వైపరీత్యాలపై పీహెచ్‌డీ చేస్తున్నానని, ప్రస్తుతం ఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నానని పేర్కొంది.