Home Page SliderTelangana

‘నేను అవార్డు తీసుకోవాలి..బెయిలివ్వండి’- జానీ మాస్టర్

సంచలన ఆరోపణలతో అరెస్టయిన టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోర్టుకు మధ్యంతర బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ కావాలని, ఢిల్లీకి వెళ్లి ఇత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు తీసుకోవాలని అభ్యర్థించారు జానీ మాస్టర్. నాలుగు రోజుల కస్టడీ అనంతరం ఆయనను తిరిగి చంచల్ గూడా జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. దీనిపై నార్సింగి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దన్నారు. దీనితో తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేశారు. పోలీసుల కస్టడీలో తనపై కుట్ర జరిగిందని, బాధితురాలి ఆరోపణలు నిజం కాదని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమే మానసికంగా హింసించిందని పోలీసుల ఎదుట జానీమాస్టర్ వాంగ్మూలం ఇచ్చారు. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో, పోక్సో కేసులో జానీమాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే.