Andhra PradeshHome Page Slider

సంబంధం లేని కేసులో ఇరికించారు

స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. ఆయినప్పటికీ తనను అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఏ మాత్రం బాలేదని ఆయనను ఇప్పుడు అరెస్ట్ చేయడం మంచిది కాదంటూ ఆయన తరపున లాయర్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పోలీసులు చంద్రబాబును విజయవాడ తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.

మరోవైపు చంద్రబాబు నాయుడుని పరామర్శించేందుకు తనకు హక్కు లేదా అంటూ టిడిపి యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా చంద్రబాబుని పరామర్శించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తండ్రిని చూసేందుకు వెళ్లకుండా అడ్డుకోవడంపై లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.