Home Page SliderTelangana

“నేనెన్నడూ కోర్టులను ప్రశ్నించలేదు”..రేవంత్ రెడ్డి

తాను కోర్టులను ప్రశ్నిస్తున్నానని వచ్చిన మీడియా వార్తలలో ఎంతమాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు న్యాయ వ్యవస్థపై ఎంతో గౌరవం, విశ్వాసం ఉందని పేర్కొన్నారు. గురువారం నాడు కొన్ని మీడియాలలో తాను చెప్పినట్టుగా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయని, అవి తననెంతో బాధించాయని రేవంత్ విచారం వ్యక్తం చేశారు.  తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా కొన్ని కథనాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చినందుకు తాను కోర్టు తీర్పును తప్పుపట్టానని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలా స్పందించారు.