Home Page SliderTelangana

నాకు డ్రగ్స్ తీసుకోమని చాలాసార్లు ఆఫర్లు వచ్చాయి: హీరో నిఖిల్

ఈ రోజు హైదరాబాద్‌లో డ్రగ్స్ నివారణపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు సినీ నటుడు ప్రియదర్శితో కలిసి గెస్ట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  నిఖిల్ టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. డ్రగ్స్ కేసులో ఎవరో కొందరు చేసిన తప్పుని ఇండస్ట్రీ మొత్తానికి రుద్దడం సరికాదన్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్ బాధితులు ఉన్నారన్నారు. ఇక్కడకి చాలామంది వచ్చి సిండికేట్‌గా డ్రగ్స్ అమ్ముతుంటారని నిఖిల్ స్పష్టం చేశారు. అయితే పోలీసులు వారందరినీ అరికడతారని నిఖిల్ తెలిపారు. నాకు కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవాలని ఆఫర్ చేశారన్నారు. కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని నిఖిల్ వెల్లడించారు. డ్రగ్స్‌కు అందరు దూరంగా ఉండాలని నిఖిల్ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే అదే మరణ శిక్ష అవుతుందన్నారు. యూత్ పార్టీలకు వెళ్లండి కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకండి అని నిఖిల్ సూచించారు. త్వరలోనే మన తెలంగాణా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణా అవ్వాలని కోరుకుంటున్నట్లు హీరో నిఖిల్ పేర్కొన్నారు.