నాకు గజ్వేల్‌లోనే బంపర్ మెజారిటీ వస్తుంది: ఈటల
తెలంగాణ: తనకు హుజూరాబాద్ కంటే గజ్వేల్‌లోనే ఎక్కువ మెజారిటీ ఓట్లు లభిస్తాయని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన ఈటల. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. నామినేషన్ కార్యక్రమానికి 20 వేల మందికి ఫోన్ చేస్తే 50 వేల మంది ప్రజలు నాకూడా వచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కాపాడటానికి ఓటు హక్కు తుపాకీలో బుల్లెట్ లాంటిదని తెలిపారు.

