నా దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత డబ్బులేదు-అందుకే పోటీ చేయను: నిర్మల
ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైనంత డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. అందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఏపీ లేదా తమిళనాడు నుండి పోటీ చేసేందుకు పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కానీ, బాగా ఒక పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పాను. నా వద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటి వాటిని పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా అని వెల్లడించారు.

