Home Page SliderNational

నేను ఒప్పుకోను.. ఇది ప్రజా నిర్ణయం కాదు..

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి దూసుకుపోతోంది. బీజేపీ నేతృత్వంలోని కూటమి రెండు వందలకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తంచేశారు. ఇది ప్రజా నిర్ణయం కాదని, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. “ఇక్కడ ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. ఆ తప్పు ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఇది ప్రజల నిర్ణయం కాదు. వారు బ్లాక్ మెయిల్ చేసి, మా సీట్లు కొన్ని దోచుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో డబ్బు లెక్కింపు మెషిన్లు పెట్టారు. ప్రజలు కూడా ఈ ఫలితాలతో ఏకీభవించడం లేదు. శిండేకు 60, అజిత్ పవార్ కు 40, బీజేపీకి 125 సీట్లు వచ్చే అవకాశం ఉందా..? ఈ రాష్ట్ర ప్రజలు నిజాయతీ పరులు. వారిపై మాకు నమ్మకం ఉంది” అని రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.