Home Page SliderNational

‘ఫలితాన్ని ఆశించి నేను పని చేయలేదు’ శాకుంతలం మూవీపై సమంత కామెంట్స్

తన పని మాత్రమే తాను సిన్సియర్‌గా చేసుకుపోయానని, ఫలితంతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది నటి సమంత. ఆమె ముఖ్యపాత్రలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాళిదాసు మధుర కావ్యం ‘అభిజ్ఞానశాకుంతలా’నికి దృశ్యరూపం ఇద్దామనుకున్న దర్శకుడు గుణశేఖర్ అనుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేదు. దీనితో అందరూ నిరాశపడ్డారు. కానీ సమంత మాత్రం ధైర్యం కోల్పోలేదు. పరోక్షంగా తన ఉద్దేశ్యాన్ని తెలియజేసింది. “కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన” అనే భగవద్గీత శ్లోకాన్ని జోడించి తన ఫొటోను షేర్ చేసింది. దీని అర్థం ‘నీ పని నీవు చేయి. ఫలితం భగవంతుని చేతిలో ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేయకు’ అనేదే ఈ శ్లోకం సారాంశం. జీవితంలో కష్టసుఖాలు సహజమని వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలని సమంత అభిప్రాయం. ప్రస్తుతం సిటాడెల్‌ అనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్, విజయదేవరకొండతో ఖుషీ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు సమంత.