విజయ్ సినిమాలో నా నటన నాకే నచ్చలేదు: మిల్కీ బ్యూటీ
స్టార్ హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో తమిళ హీరో విజయ్‌తో నటించిన “సుర” సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తన నటన తనకే నచ్చలేదని తెలిపారు. అయితే ఆ చిత్రం దళపతి విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ సినిమాలో పాటలు మాత్రం హిట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలోని పాటలంటే తనకు చాలా ఇష్టమని తమన్నా వెల్లడించారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని అనిపించిందన్నారు. అయితే ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా తమన్నా నటించిన జైలర్, భోళాశంకర్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు తమన్నా జైలర్ సినిమాలో చేసిన కావాలా సాంగ్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే.

