Home Page SliderNationalPolitics

షిండేను ఉప ముఖ్యమంత్రిగా నేనే ఒప్పించా..

మహారాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా అందరూ ఊహిస్తున్నప్పటికీ, అప్పటి వరకూ రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన షిండేను ఎవరు బుజ్జగిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ ఘనత తనదేనని ప్రకటించారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. షిండేను తానే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఒప్పించానని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. ఆయన ఎన్నికలలో విజయం తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం అయ్యేందుకు ఒప్పుకున్నారు.  కానీ షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదనుకున్నారని చెప్పారన్నారు. కానీ శివసేన వర్గం వారు తమ పార్టీ నుండి సీఎం కావాలనుకోవడంతో ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందే ఫడ్నవీస్  వెళ్లి ఆయనను ఒప్పించినట్లు పేర్కొన్నారు. చివరికి ముచ్చటగా మూడు పార్టీల నుండి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో సహా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.