Home Page SliderTelangana

నేను ఎమ్మెల్యే అవ్వడానికి రాలే-కేసీఆర్‌ను దించడానికి వచ్చా

నేను ఎమ్మెల్యే అవ్వడానికి గజ్వేల్ రాలేదు. కేసీఆర్ నుండి విముక్తి చేయడానికి వచ్చా. ఇది ఓటు సీటు పంచాయితీ కాదు. బ్రతుకుకు సంబంధించింది. మన భూమికి సంబంధించింది-ఈటల.

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం పెద్దంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్. డబుల్ బెడ్ రూమ్‌కి రూ.5 లక్షలు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తా అంటున్నారు. ధరలు పెరిగాయా? తగ్గాయా? రేషన్ కార్డ్స్ రావాలంటే కేసీఆర్ పోవాలి. దళితబంధు ఇవ్వడంలేదు. గత ప్రభుత్వాలు భూములు ఇస్తే కేసీఆర్ లాక్కుంటున్నారు. పేదలకు విలువైన భూములు ఎందుకు ఉండాలి అని TSIIC కి భూములు అమ్ముకుంటున్నారు. మల్లన్నసాగర్ భూములు కోల్పోయిన 10 ఎకరాల రైతు కూడా అడ్డా మీద కూలీగా మారారు. రేపు మన బ్రతుకులు కూడా అంతే. తల్లిని పిల్లను వేరుచేసినట్టు రైతును భూమిని వేరు చేస్తున్నారు. తల్లిని పిల్లని వేరు చేయడం పాపం. kcr కి ఆ కనికరం లేదు. కేసీఆర్‌కి ఓటు వెయ్యకపోతే ఎమ్మెల్యే కాలేరు.. సీఎం కాలేరు.. మన భూములు లాక్కోలేరు. ప్రైవేట్ కంపెనీలు పెట్టినా లిఫ్ట్ బాయ్, డ్రైవర్, అటెండర్ ఉద్యోగాలు తప్ప పెద్ద ఉద్యోగాలు లేవు, రావు. సంపాదించిన డబ్బులు అన్నీ మందు షాపుకి పోతున్నాయి. ఈ ఊరికి 6 డబ్బాల మందు పంపించారు. పిల్లలూ జాగ్రత్త మందుకు అలవాటు పడకండి.

బీజేపీ వస్తే.. ఉచితంగా వైద్యం, విద్య అందిస్తాం. ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ అందిస్తాం. నేను ఎమ్మెల్యే అవ్వడానికి గజ్వేల్ రాలేదు. కేసీఆర్ నుండి విముక్తి చేయడానికి వచ్చా-ఈటల రాజేందర్