‘మా నాన్న తర్వాత మీ నాన్ననే నమ్మాను’..మంత్రి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైరయ్యారు. “మా నాన్న తర్వాత నేను ఎక్కువగా నమ్మింది మీ నాన్న కేసీఆర్‌నే. కానీ తడిగుడ్డలతో నా గొంతు కోశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా, వద్దా? రాష్ట్రప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?” అంటూ మండిపడ్డారు. “నేను గౌతమ్ అదానీతో హైదరాబాద్‌లోని హోటల్‌లో భేటీ అయ్యానని, కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదానీని నేను హోటల్‌లో లిఫ్ట్ వద్ద కలిశాను. పాత పరిచయం వల్ల హాయ్ చెప్పాను. గత పదేళ్ల కాలం అదానీతో అంటకాగింది మీ పార్టీనే, చాలా ఒప్పందాలు చేసుకుంది.” అంటూ మండిపడ్డారు.