ఉద్యమకారుణ్ణి నేనే-బీజేపీ అభ్యర్థి విజయరామారావు
ధర్మసాగర్: ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు కడియం శ్రీహరితో ఎలా ఉంటున్నారని స్టేషన్ ఘన్‌పూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు ప్రశ్నించారు. మండలంలోని శాయిపేట, ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. తానే అసలైన ఉద్యమకారుడినని, తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తీర్చి, రోడ్లు వేయించానన్నారు. రాష్ట్రంలో మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుక విజయరావు, ఇతర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.