Home Page SliderInternational

‘నాకు ప్రాణహాని ఉంది’ పాక్ మాజీ ప్రధాని లేఖ

‘తనకు ప్రాణహాని ఉందని, తనను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు హత్య చేసే ప్రమాదం ఉందని’ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ చీఫ్ జస్టిస్‌కు లేఖ వ్రాసారు. తనను వర్చువల్‌గా విచారించే ఆవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ‘తోషఖానా’ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్. విదేశాల నుండి పాకిస్తాన్‌కు వచ్చిన బహుమతులు ఎక్కువ ధరకు విదేశాలకు అమ్ముకున్నారనే అభియోగాలతో పాటు ఈయనపై 100 పైగా కేసులు ఉన్నాయి. బహుమతుల వివరాలను ప్రభుత్వ లెక్కల్లో చూపించలేదని, వాటి ద్వారా లబ్ది పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి.