Home Page SliderTelangana

“ఆయన మనవడిగా గర్వపడుతున్నాను”..కేటీఆర్

నేను ఆయన మనవడిగా చాలా గర్వపడుతున్నానంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తన ఎక్స్‌ఖాతాలో పోస్టు చేశారు. సాక్షి పేపర్‌లో వచ్చిన ఓ కథనంపై ఆయన ఇలా వ్యాఖ్యానించారు. కేటీఆర్ తాతయ్య కేశవరావు అప్పటి నిజాం పాలనపై పోరుబాట పట్టారని ఈ వార్త వివరంగా పేర్కొంది. కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు స్వయానా కేసీఆర్‌కు మామ. అప్పట్లో రజాకారులు ఖాసీం రజ్వీ సేనలు, పల్లెలలో చేస్తున్న అరాచకాలపై గ్రామస్తులతో కలిసి కేశవరావు తిరుగుబాటు చేశారు. సాయుధపోరుకు ఆయుధాలు సమకూర్చేవారని ఈ వార్త పేర్కొంది. మూడుసార్లు వరంగల్‌ జైలుకు కూడా వెళ్లారని కథనంలో చెప్పారు. ఈ కథనంపై కేటీఆర్ స్పందిస్తూ ఆయనకు మనవడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరిగిన సందర్భంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ న్యూస్ పేపర్‌లోని తాత కేశవరావుతో చిన్ననాటి కేటీఆర్, కవిత ఫోటో కూడా ఉండడం విశేషం.