నా కూతురిని చూసి గర్విస్తున్నా..
తన కూతురిని చూసి గర్విస్తున్నానని కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే.. ఆ పాకిస్తాన్‌ను నాశనం చేస్తాను. అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదు. మా తాత, తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలు సేవలు అందించా’ అని ఆయన పేర్కొన్నారు. మతం కాదు.. దేశ భద్రతే కర్తవ్యమని ఖురేషి ఫ్యామిలీ దేశభక్తిని చాటారు. అయితే.. పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ముస్లిం మహిళ సైనిక్ అధికారి సోఫియా ఖురేషి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.