నేను సీఎం రేసులో లేను..
ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. తాను సీఎం అభ్యర్థి రేసులో లేనని, తనకు సీఎం పదవి అవసరం లేదని ఆయన ప్రకటించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన బీఆర్‌ఎస్‌లోనే వర్గపోరు ఉందని ఆరోపించారు.. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో సీఎం అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడించారు. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సహం వచ్చిందని వెంకట్ రెడ్డి అన్నారు. రైతులు, నిరుద్యోగులు మోసం చేసిన బీఆర్‌ఎస్.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు.
Read more: బిగ్ ట్వీస్ట్.. సీఎం రేసులో మూడో వ్యక్తి