Home Page SliderNational

నేను చావ లేదు, బతికే ఉన్నా… పూనమ్ చీప్ ప్రచారంపై నెటిజన్లు ఫైర్

సర్వైకల్ క్యాన్సర్ కారణంగా బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మేనేజర్ చేసిన ప్రకటన నిన్నంతా సంచలనం సృష్టించింది. 32 ఏళ్ల వయసులోనే పూనమ్ చనిపోవడంపై దేశ వ్యాప్తంగా ఎందరో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా డిజిటల్ క్యాంపెయిన్ అంటూ తేలింది. అయితే ఎవరైనా ఇలాంటి చీప్ ప్రచారం చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పూనమ్ గురించి తెలిసివారు ఆమె అలాంటిదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వందల వేల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని… క్యాన్సర్‌తో కూడిన మరణాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా ఉపయోగించడం ఘోరమంటున్నారు. ఆలోచన లేని, నీచమైన ఆలోచనలలో ఒకటంటూ ఆక్షేపిస్తున్నారు. భయంకరమైన అనారోగ్యాన్ని అపహాస్యం చేసారని విమర్శిస్తున్నారు.

తాజాగా పూనమ్ తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని పేర్కొన్నారు. తాను సర్వైకల్ క్యాన్సర్ ను చంపాలనకుంటున్నానని.. అందుకే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో సందేశాన్ని షేర్ చేసింది. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నాను, సజీవంగా ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను చనిపోలేదు. కానీ విషాదకరంగా, ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల ప్రాణాలను బలిగొంది. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. HPV వ్యాక్సిన్, ముందస్తుగా గుర్తించే పరీక్షలలో ఈ పోరులో కీలకం. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి. క్లిష్టమైన అవగాహనతో ఒకరినొకరు శక్తివంతం చేద్దాం. ప్రతి మహిళ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. కలిసి, వ్యాధి వినాశకరమైన ప్రభావాన్ని అంతం చేయడానికి కృషి చేద్దామంటూ సందేశాన్ని పూనమ్ పాండే పోస్ చేసింది.