“నేను తాటాకు చప్పుళ్లకు భయపడను”:ఎంపీ విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసారెడ్డి టీడీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కాగా ఏపీలో టీడీపీ రాక్షస పాలనను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.టీడీపీ వాళ్లు కావాలనే వైసీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా తాను ఓ మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.ఇలా చేసి తన పేరు,ప్రతిష్ఠను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ దుష్ప్రచారం చేస్తున్నవారు మా పార్టీవాళ్లు అయినా వాళ్లని వదిలిపెట్టనన్నారు. కాగా తాను తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి పక్షంలో ఉన్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.ఏపీలో మధ్యంతర ఎన్నికలు జరిగితే తామే అధికారంలోకి వస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం..తోకలు కట్ చేస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు.