Home Page SliderNational

నేను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాను: డీకే శివకుమార్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వేగంగానే వచ్చాయి. కానీ కర్ణాటక సీఎం ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదు.  కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో ప్రముఖ నేతలు ఉండడం వల్ల ఎవరిని సీఎం చేయాలనే దానిపై అధిష్ఠానం తలామునకలౌతుంది. కాగా నిన్న ఉదయం నుంచి సీఎం ఎవరు అనే అంశంపై గంటలపాటు చర్చలు జరిపినప్పటికీ అవేవి సఫలం కాలేదు. అయితే  సీఎం రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు సిద్దరామయ్య,డీకే శివకుమార్ సీఎం పదవిపై తమ వాదనలు వినిపించారు. అంతేకాకుండా హైకమాండ్‌తో చర్చించేందుకు సిద్దరామయ్య, డీకే శివకుమార్ నిన్న ఢిల్లీ వెళ్లాల్సివుండగా..సిద్దరామయ్య ఒక్కరే ఢిల్లీకి పయనమయ్యారు. కాగా  డీకే శివకుమార్ సీఎం సీటు గురించి అధిష్ఠానంతో చర్చించేందుకు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ..మాది ఒక యునైటెడ్ హౌజ్ అన్నారు. మా నెంబర్ 135 అని ,ఇక్కడ ఎవరినీ వేరు చేయడం నాకు ఇష్టం లేదన్నారు. వాళ్లకు నచ్చిన నచ్చకపోయిన నేను బాధ్యత గల మనిషిని అని పేర్కొన్నారు. నేను ఎవరిని వెన్నుపోటు పొడవను,బ్లాక్ మెయిల్  చేయనన్నారు. మేము ఈ పార్టీని నిర్మించుకున్నాము. ఇందులో నేనూ భాగమే అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.