ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నా..
టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా అస్వస్థత కు గురై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారనే ప్రచారం పై రతన్ టాటా స్పందించారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్టు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. వృద్ధాప్యం వచ్చే అనారోగ్యం, వైద్య పరీక్షల కోసం తాను వెళ్లాలని తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

