నేను రాక్షసుడినే.. ఎంతవరకైనా తెగిస్తాను..
వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తనను రాక్షసుడని సంభోదించడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఆగ్రహించారు. అవును తాను రాక్షసుడినేనని, ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తానని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తాను సొంత జిల్లాలో ఏడుసార్లు గెలిచానని.. కానీ రేవంత్ ఓ సారి గెలిచిన చోట మళ్లీ గెలవరని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని వారిపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

