భారత్‌లో హైపర్ లూప్ జర్నీ..
భారత్‌లో కూడా త్వరలోనే హైపర్ లూప్ జర్నీ సాధ్యం కాబోతోంది. వందే భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ఘనత సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ నుండి జైపూర్‌కు మధ్యగల 300 కిలోమీటర్ల దూరాన్ని కేవలం అరగంటలో వెళ్లగలిగేలా హైస్పీడ్ ప్రయాణాన్ని రూపొందిస్తున్నారు కేంద్ర మంత్రిత్వ శాఖ. ఐఐటీ మద్రాస్‌తో కలిసి 450 మీటర్ల టెస్ట్ ట్రాక్ సిద్ధం చేసింది. అధునాతనమైన రవాణా వ్యవస్థగా హైపర్ లూప్‌ను చెప్పవచ్చు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ఈ మార్గంలో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ఇది రవాణా వ్యవస్థలోనే గేమ్ ఛేంజర్ అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

