Home Page SliderInternational

భూటాన్‌ వరదల్లో కొట్టుకుపోయిన హైడ్రోపవర్ ప్లాంట్.. 20 మంది గల్లంతు

భూటాన్‌లో సంభవించిన వరదల కారణంగా అక్కడ ఏకంగా హైడ్రోపవర్ ప్లాంటే కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ప్రాజెక్టు సిబ్బంది సహా 20 మంది గల్లంతయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న దేశప్రధాని లోతే షేరింగ్ ఈ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. భూటాన్‌కు తూర్పున ఉన్న 32 ఎండబ్ల్యూ యంగిచు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది. దీనిలో ప్రధాన భాగానికి నష్టం వాటిల్లకపోయినా కొంతమేర ఈ వరదలలో కొట్టుకుపోయిందని డ్రక్ గ్రీన్ పవర్‌కు చెందిన అధికారులు పేర్కొన్నారు. ఇది జాతీయ విపత్తుగా పేర్కొంటున్నారు. భారత్, చైనాల మధ్యగల కేవలం ఏడున్నర లక్షల మంది మాత్రమే ఉన్న భూటాన్ భూభాగంలో ఇలాంటి ఘటనలు జరగడం అరుదనే చెప్పాలి. కాగా ఈ వరదల కారణంగా భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉత్తర ప్రాంతంలో సిలిగురి, జలపాయ్ గురి ప్రాంతాలు ముంపునకు గురవడం గమనార్హం.