అక్రమ నిర్మాణాలపై ఆగని హైడ్రా కూల్చివేతలు.
హైదరాబాద్: అల్వాల్‌లోని చిన్నారుకుంట వద్ద అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను HYDRAA అధికారులు గురువారం కూల్చివేశారు.చిన్నారుకుంట ప్రాంతంలోని FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో మూడు భవనాలను అనుమతులు లేకుండా నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణాల వల్ల వర్షపు నీరు ట్యాంక్‌లోకి ప్రవేశించకుండా అడ్డంకి ఏర్పడి, పక్కనే ఉన్న కాలనీల ఇళ్లలోకి నీరు చేరుతోందని వారు ఆరోపించారు.ఫిర్యాదు అందిన వెంటనే హైడ్రా బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించాయి. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో గురువారం ఉదయం కూల్చివేత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.