Home Page SliderTelangana

ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం.. హైడ్రా వార్నింగ్

తెలంగాణ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది.ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎఫ్టీఎల్ బఫర జోన్ పరిధిలో నిర్మించినందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం. విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ళ పొరపాటు అయి ఉండొచ్చు. ఎఫ్టీటీఎల్ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థులు భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే అంటూ కామెంట్స్ చేశారు.