బెంగళూరులో హైడ్రా టీమ్
హైడ్రా ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం కర్ణాటకలో పర్యటిస్తున్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ అధికారుల బృందం బెంగళూరుకు చేరుకున్నారు. కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ను సందర్శించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా హైదరాబాద్ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతోనూ హైడ్రా అధికారులు సమావేశం కానున్నారు.

