“హైడ్రా ఎవ్వరినీ వదలదు”..రేవంత్
హైదరాబాద్ నగరంలో ఆక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం. హైడ్రా ఎవ్వరినీ వదలదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరిపై ఎలాంటి పక్షపాతం లేకుండా తనపని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరమే కాకుండా ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయితీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయి. కొందరు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, పెద్దమనుష్యులు శివార్లలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. ఆ మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ వంటి జలాశయాలలోకి వదులుతున్నారు. వారిని కూడా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

