బతుకమ్మ పండుగ నాటికి రెడీ..హైడ్రా
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటలో ప్రత్యేక పూజలు చేసి, అభివృద్ధి పనులను ప్రారంభించారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటి కల్లా ఈ కుంటను శుభ్రం చేయించి, చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ వారి సహకారం అందించాలని కోరారు. వచ్చే ఏడాది నుండి బతుకమ్మ కుంటలోనే ఉత్సవాలు జరుగుతాయి. కోర్టు తీర్పుతో బతుకమ్మ కుంట అభివృద్ధికి ఉన్న అడ్డంకి తొలగిపోయిందని ఆయన పేర్కొన్నారు.


 
							 
							