ఏపిలోనూ హైడ్రా తరహా కూల్చివేతలు
తిరుపతి రేణిగుంట మండలంలో హైడ్రా తరహా కూల్చివేతలు శనివారం జరిపారు. కనీస సమాచారం లేకుండా దాదాపు 22 ఇళ్లను గంట వ్యవధిలో కూల్చివేశారు.దీని కోసం భారీ తరహా జేసిబిలను వినియోగించారు. అనుమతుల్లేని అక్రమ కట్టడాలుగా భావించి వీటిని కూల్చివేస్తున్నట్లు రేణిగుంట రెవిన్యూ అధికారులు మీడియాకు తెలిపారు. కుర్రకాలువలో 22 ఇళ్లను కూల్చివేయగా సూరప్పకసంలో 120 ఇళ్లకుపైగా కూల్చిసినట్లు ప్రకటించారు. మరో 100 అక్రమ నిర్మాణాలు గుర్తించామని వీటిని కూడా ఆదివారం లోపు కూల్చివేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేశారు.దీంతో తెలంగాణా తరహాలోనే ఏపిలో కూటమి ప్రభుత్వం కూడా హైడ్రా తరహా విధానాన్ని అమలు పరిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.