కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
నగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కూల్చివేతలపై కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పిస్తున్నారని, చట్టబద్దమైన అనుమతులుంటే ఎవ్వరూ భయపడనక్కరలేదని హామీ ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాల జోలికి పోమని, అనుమతులున్న వెంచర్ల యజమానులు ధీమాగా ఉండొచ్చని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉందని పేర్కొంది.