ఓల్డ్ సిటీలో హైడ్రా.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బండ్లగూడలో హైడ్రా కొరడా ఝుళిపించింది. అక్బర్ నగర్ లోని సర్వే నంబర్లు 303 – 306 లో ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన్నట్లుగా గుర్తించగా.. ఇవాళ తెల్లవారుజామున భారీ పోలీసులు బందోబస్తులో రంగంలోకి దిగిన హైడ్రా ఆఫీసర్లు జేసీబీలతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చి వేశారు. ఈ క్రమంలో పలువురు ఎంఐఎం కార్పొరేటర్లు, మహిళా నాయకులు హైడ్రా అధికారులపై నిరసన చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.