Home Page SliderTelangana

శంషాబాద్ లో హైడ్రా.. రోడ్డు ఆక్రమణల కూల్చివేత..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఇవాళ హైడ్రా అధికారులు పంజా విసిరారు. సంపత్ నగర్ లోని ఓ వెంచర్ లో పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించారని, ఊట్ పల్లిలో 40 ఫీట్ల రోడ్డు ఆక్రమించి గేటు ఏర్పాటు చేశారని ఇటీవల స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికారులు విచారణ జరిపారు. ఆక్రమణలు వాస్తవమేనని తేలడంతో ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. కబ్జాదారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.