హైకోర్టులో హైడ్రా కమిషనర్ వర్చువల్‌గా హాజరు
అమీన్‌పూర్‌లో హాస్పటల్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు హైకోర్టులో పెండింగు దశలో ఉంది. దీనిపై ఎలా నిర్ణయాధికారం ఉంటుందని కోర్టు హైడ్రాను ప్రశ్నించింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా నేడు హాజరయ్యారు. దీనిపై అమీన్‌పూర్ తహశీల్దార్ ఇచ్చిన వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. ఆ భవనాన్ని 48 గంటలలోగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి, 40 గంటలలోనే ఎలా కూల్చి వేశారని తాహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. పైగా శని, ఆదివారాలలో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని మండిపడింది. సెలవు రోజులలో ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, గతంలో శని, ఆదివారాలలో కూల్చివేతలు చేపట్టకూడదని కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. దీనితో కమిషనర్‌ను హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.