Home Page SliderNews AlertTelangana

అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాదీ.. ధర తెలిస్తే షాక్‌…

దేశంలోనే అత్యంత ఖరీదు కలిగిన కారును హైదరాబాద్‌కు చెంని వ్యాపారవేత్త నసీర్‌ ఖాన్‌ కొనుగోలు చేశాడు. సుమారు 12 కోట్లు పెట్టి అతను మెక్‌లారెన్‌ 765 ఎల్‌టీ స్పైడర్‌ కారును కొన్నాడు. ఈ కారులో విశేషం ఏమిటంటే ఎలక్ట్రిక్‌ హార్డ్‌ టాప్‌ కారు ఓపెన్‌ కావడానికి 11 సెకన్ల సమయం పడుతుంది. కార్బన్‌ ఫైబర్‌తో బాడీని తయారు చేశారు. కొత్త సూపర్‌ కారుకు చెందిన వీడియోను తన ఇస్‌స్టా అకౌంట్‌లో నసీర్‌ ఖాన్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే అతని గ్యారేజిలో ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్‌ రాయిస్‌ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

మెక్‌లారెన్‌ సంస్థ ఇండియా మార్కెట్‌లోకి గత ఏడాది ఎంటరైంది. ఈ సంస్థను ఇండియాలో ఇన్ఫినిటీ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్‌ తన మొత్తం పోర్ట్ ఫోలియోను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ముంబైలో తొలి డీలర్‌షిప్‌ ప్రారంభించింది. మొదటి కస్టమర్‌గా హైదరాబాదీకి అవకాశం కల్పించింది.