మెస్సీ టూర్ కోసం హైదరాబాద్ సిద్ధం
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ తన G.O.A.T. టూర్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ను కూడా చేర్చిన సంగతి తెలిసిందే. అతను డిసెంబర్ 13న నగరానికి రానున్నట్లు ప్రకటించడంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మెస్సీకి రాష్ట్రం తరఫున స్వాగతం పలికారు.
“డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డపై మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆశించిన ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సగర్వంగా సిద్ధంగా ఉంది” అని సీఎం ట్వీట్ చేశారు.
మెస్సీ పర్యటన వేళ భారీ జనసందోహం ఉండొచ్చని భావిస్తూ, అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. నగరంలోని స్టేడియాలు, ఇతర వేదికల్లో టూర్‌కు సంబంధించిన లాజిస్టిక్స్‌పై సమీక్షలు జరుగుతున్నాయి.

