ప్రపంచ మోస్ట్ రిచెస్ట్ సిటీలలో “హైదరాబాద్”
హైదరాబాద్ నగరం భారతదేశ సుప్రసిద్ధ నగరాలలో ఒకటి. అంతేకాకుండా భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో అయిదవది. పక్కనున్న చిన్న చిన్న మున్సిపాలీటీలను కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్‌గా ప్రపంచపటంలో గుర్తింపు సంపాదించుకొంది. మరోపక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ,చరిత్రకు , కట్టడాలకు, మసీదులకు, దేవాలయాలకు,హస్తకళలకు,కళలకు,నాట్యానికి,సినీ రంగానికి ప్రసిద్ది చెందింది. వీటన్నింటితోపాటు అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతునన్న హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. వెల్త్ ట్రాకర్ కంపెనీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ఈ ఏడాదికిగాను ప్రపంచంలో సంపన్న నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో ధనవంతుల సంఖ్య 78% పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో మొదటి స్థానం న్యూయార్క్ సిటీ దక్కించుకుంది.

