భారీ ఆదాయంతో రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్
ఈ సారి హైదరాబాద్ GHMC కి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కాగా 2022-2023 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేది రాత్రి 11 గంటల వరకు GHMCలో రూ.1,681.72 కోట్లు వసూలు అయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఖైరతాబాద్ జోన్‌లో రూ.435.57 కోట్లు,శేరిలింగంపల్లి జోన్‌లో రూ.348.60 కోట్లు,కూకట్‌పల్లి జోన్‌లో రూ.282.18 కోట్లు,ఎల్‌బీనగర్ జోన్‌లో రూ.259.06కోట్లు, సికింద్రాబాద్ జోన్‌లో రూ.233.44కోట్లు,చార్మినార్ జోన్‌లో రూ.122.86 కోట్లు వసూలు అయినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ మొత్తంలో GHMC కి ఆదాయం రావడం ఇదే తొలిసారి అని GHMC అధికారులు తెలిపారు.

