Telangana

పెన్ను ఆర్డర్ చేసా-సంతకం త్వరగా చేయండి

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్టు కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. ఈ విషయంగా రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణాసాగర్ చేసిన పని వైరల్‌గా మారింది. ప్రభుత్వం తరపు న్యాయవాది 1650 పేజీలతో కౌంటరు సిద్ధం చేశామని, దానిపై సంతకాలు చేసి కోర్టులో సమర్పించేందుకు గడువు కావాలని కోరడంతో న్యాయస్థానం ఈ నెల 28కి విచారణను వాయిదా వేసింది. దీనితో న్యాయవాది కమీషనర్‌ను సంతకాలు త్వరగా చేయాలని కోరుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేరిట ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో పార్కర్ పెన్ను ఆర్డర్ చేసారు న్యాయవాది. పీడీయాక్టు కౌంటర్‌పై త్వరగా సంతకం చేయాలంటూ న్యాయవాది కరుణాసాగర్ సింబాలిక్‌గా 357 రూపాయలు ఖరీదైన పార్కర్ పెన్నును బషీర్ బాగ్‌లోని కమిషనర్ కార్యాలయానికి ఆర్డర్ పెట్టారు. పెన్ను అందిన తర్వాతే డబ్బు చెల్లించేలా ఈ ఆర్డర్ పెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.