హైదరాబాద్/అమరావతి: రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాల హెచ్చరిక..
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల ప్రభావం తీవ్రమైంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ నెల 20వ తేదీ వరకు కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు నమోదవుతున్నాయి.
దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం దాకా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. దీని ప్రభావంతో ఈ రోజు (సోమవారం) తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, గంటకు 30–40 కిమీ వేగంతో వీచే మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
అలాగే ఈ రోజు తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 38.5, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
వర్షాల కారణంగా ప్రభావితమయ్యే జిల్లాలు:
రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:
శ్రీకాకుళం
పార్వతీపురం మన్యం
అల్లూరి సీతారామరాజు
ఏలూరు
నంద్యాల
అనంతపురం
శ్రీసత్యసాయి
చిత్తూరు
ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
మత్స్యకారులకు హెచ్చరిక:
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హితవు పలికింది.