ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే హైదరాబాద్ Airport ఎంతో రద్దీ…
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ, విమానాల రాకపోకలు గత ఏడాదితో పోలిస్తే బాగా పెరిగాయి. ఈ విషయంలో ఢిల్లీ విమానాశ్రయంతో పోల్చితే హైదరాబాద్ విమానాశ్రయం ఎంతో ముందుండడం ఆసక్తికర అంశం. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం నుండి 20.32 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022 నవంబర్‌తో పోలిస్తే సంఖ్య 16 శాతం అధికం. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయానికి 14,462 విమానాలు వచ్చి వెళ్లాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం ఎక్కువ. 2022 నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రయాణికుల రాకపోకల సంఖ్య 7 శాతం, విమానాల రాకపోకల్లో 1 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. స్మార్ట్ ట్రాలీ సదుపాయం గత నెల 25న ఒక్కరోజే హైదరాబాద్ విమానాశ్రయం నుండి రికార్డు స్థాయిలో 75 వేల మంది రాకపోకలు సాగించినట్లు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ దేశీయంగా కొత్త మార్గాల్లో విమాన సర్వీసులు నడుపుతోంది. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్ విమానాశ్రయంలో స్మార్ట్ ట్రాలీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.


 
							 
							