Home Page SliderTelangana

75 ఏళ్ల రైతు కిడ్నీ నుండి 300 రాళ్లు తీసిన హైదరాబాద్ AINU డాక్టర్లు

ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హైటెక్ సిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు 75 ఏళ్ల వయస్సున్న రైతు కిడ్నీ నుండి విజయవంతంగా 300 రాళ్లను తొలగించారు. ఇంత సంఖ్యలో మనిషి కిడ్నీలో రాళ్లు ఉండడం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. కరీంనగర్‌కు చెందిన రామిరెడ్డి (75) గత కొన్ని నెలలుగా విపరీతమైన నడుంనొప్పితో బాధ పడుతున్నారు. AINU హైటెక్ సిటీలో చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అతని కిడ్నీలో దాదాపు 7 సెంటీమీటర్ల సైజు గల రాళ్లు ఉన్నట్లు కనిపెట్టారు.  సాధారణంగా ఎవరికైనా 7 నుండి 15 మిల్లీమీటర్ల సైజులోనే రాళ్లు ఏర్పడతాయి. కానీ ఇంత సైజులో రాళ్లు ఉండడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

పేషంట్‌కు వయస్సు ఎక్కువగా ఉండడం, అతనికి మధుమేహం, బీపీ, హృదయసంబంధ వ్యాధులు ఉండడంతో అతనికి చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయవల్సిన అవసరం ఏర్పడింది. అందుకే డాక్టర్ మల్లికార్జున అథ్వర్యంలో టీమ్‌గా ఏర్పడి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని, అడ్వాన్సడ్ లేజర్ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అతి పెద్ద రాయి ఉండడంతో దానిని తొలగించడం డాక్టర్లకు సవాలుగా మారింది. దానిని కీహోల్ సర్జరీ ద్వారా తొలగించామని పేర్కొన్నారు. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా కొంత కాలానికి తిరిగి ఏర్పడే ప్రమాదం ఉంటుందని, బాగా నీరు తాగాల్సి ఉంటుందని తెలియజేశారు.