Home Page SliderTelangana

హుజూరాబాద్: వీణవంక-మామిడాలపల్లి ఎన్నికల ప్రచారంలో ఈటల

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇది ఫైనల్ పంచాయితీ. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి నేను పనిచేస్తుంటే కేసీఆర్ ఓర్వలేక.. కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము అడ్డం అని బయటికి పంపించారు. హుజూరాబాద్ ఏ ఇంటికి ఆ ఇల్లు కథానాయకులై నడిపించారు. కాబట్టే, ఉపఎన్నికల్లో గెలిచాం. ఆనాడు గెలిచింది మీరు,  ప్రజాస్వామ్యం. ఆనాడు ఇచ్చిన హామీలు ఇప్పటికి కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అని ఇవ్వలేదు.

5 లక్షలు ఇస్తా అని ఇప్పుడు 3 లక్షలే ఇస్తా అంటున్నారు. ప్రేమ ఉన్నట్టా లేనట్టా? బీజేపీ వస్తే కేంద్ర సహకారంతో ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది. రాష్ట్రం దివాళా తీసింది.కేసీఆర్ ది ఒడిసిన కథ. ఇంకా ఏం చెయ్యలేడు. పెన్షన్ ఇవ్వడం చేతకాదు. బీజేపీ వస్తే ముసలివాళ్లు ఇద్దరికీ పెన్షన్ అందిస్తాం. కేసీఆర్ ఉద్యోగాలు అమ్ముకోవడంతో నౌకరీలు దొరక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము వస్తే రూపాయి ఖర్చు లేకుండా విద్య, వైద్యం అందిస్తాం.

హుజూరాబాద్ గెలుపుతో నా జన్మధన్యమైంది. చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదు అని చెప్పిన. ఆనాడే దమ్ముంటే నా హుజూరాబాద్‌కి రా లేదంటే గజ్వేల్‌కి వస్తా అని చెప్పిన.. నేనుపోతే ఆయన కామారెడ్డికి పారిపోయిండు. అక్కడ కూడా మనవాడు మోపయ్యిండు. ఇది పార్టీ, జెండాల పంచాయితీ కాదు.. కేసీఆర్‌ను ఓడగొట్టే పంచాయితీ.