Home Page SliderTelangana

హుజూరాబాద్‌: మల్లన్నపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మల్లన్నపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్. సర్పంచ్ విజయ్, మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి  పాల్గొన్నారు.

రాష్ట్రంలో మనం నిర్ణయం తీసుకొనే అవకాశం వస్తే.. బస్తా వజన్ తప్ప కిలో కూడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. ఉచిత ఇంగ్లీష్ విద్య, వైద్యం అందిస్తాం. తెల్లరేషన్ కార్డు ఇస్తాం. ఇద్దరు ముసలివాళ్లకు పెన్షన్ ఇస్తాం. మహిళలకు వడ్డీ లేని రుణాల బాకీ రూ.4,200 కోట్లు చెల్లిస్తాం.. రైతు కూలీలకు కూడా రూ.5 లక్షల భీమా అందిస్తాం. కేసీఆర్‌ను తిట్టి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకోవడం లేదు. ప్రజల సమస్యలు తెలిసినవాళ్ళం వాటిని తీర్చేందుకే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం.