హుజూరాబాద్: వీణవంక-చల్లూరు ప్రచారంలో పాల్గొన్న ఈటల
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.
ఈటల మాట్లాడుతూ: కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రష్టుపట్టించాడు. గరీబు వాడు ప్రజాసేవకుడు అయ్యే అవకాశం లేకుండా చేశారు. సేవ చేసే నాయకుడు కాదు పదవి కొనుక్కొనేవాడు కావాలని కేసీఆర్ రాజకీయం మార్చారు. సంస్కారం లేకుండా చేశారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.
** **
నాయకులను వ్యక్తిగతంగా నేను ఎప్పడూ తిట్టలేదు. ఆరోగ్యమంత్రిగా ఉండి కూడా జీవచ్ఛవంలా పడిఉన్న ఒక అమ్మాయికి పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్న. పెన్షన్ ఇవ్వకుండా కేసీఆర్ తాళం వేసుకున్నాడు ఓపెన్ చేయమని చెప్తా అని బజాప్తా బజారులో మాట్లాడిన. ప్రభుత్వం పేదవారికోసం ఉండాలి తప్ప పెద్దవారికోసం కాదు అని చెప్పిన. వందల ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు ఇవ్వవద్దని ఇదే చల్లూర్ గ్రామ రైతు వేదిక ప్రారంభ కార్యక్రమంలో చెప్పిన.
ఖమ్మంలో ముత్యాల శంకర్ ఉద్యోగం రాక ఉరికివచ్చే ట్రైన్‌కి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఉద్యోగాలు నింపడం లేదు. మేము వస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాం. దరఖాస్తు ఇచ్చి దండంపెట్టే హుజురాబాద్ తెలంగాణకు అన్నీ ఇచ్చే స్థాయికి వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచిత ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తాం.
ఉచిత వైద్యం అందిస్తాం. ముసలివాళ్లకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. రైతుబంధు ఇచ్చి వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీ ఎత్తివేశారు. బీజేపీ వస్తే అన్ని పునరుద్ధరిస్తాం. కేసీఆర్ చెప్పే మాటకు చేసేపనికి పొంతన లేదు కాబట్టి ఆయన్ను ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న. ఈ గడ్డబిడ్డను, రోషం కల బిడ్డ కాబట్టి కేసీఆర్ మీద పోటీ చేయడానికి గజ్వేల్ పోయిన. కానీ కేసీఆర్ కామారెడ్డి పారిపోయారు. పోలీసులను నమ్ముకున్న వాడు ఎప్పుడూ బాగుపడడు. నేను ధర్మంను, ప్రజలను నమ్ముకున్న. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా స్థానం లేదు. ఇది పార్టీల పంచాయితీ కాదు. బ్రతుకు మార్చే, బ్రతుకు బాగుచేసే పంచాయితీ. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.
నేను హుజూరాబాద్ వదిలిపెట్టను. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి.. ఎల్లవేళలా మీకు అండగా ఉంటా–మీ ఈటల రాజేందర్