‘దమ్ముంటే ముందు హుస్సేన్ సాగర్ క్లీన్ చేయ్ బిడ్డా’..ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. హైడ్రా పేరుతో ఇష్టారాజ్యంగా ఇళ్లు కూల్చడాన్ని ఆయన విమర్శించారు. చెరువుల రక్షణపై శ్రద్ధ ఉంటే, దమ్ము ఉంటే హుస్సేన్ సాగర్‌ను కాపాడమని, మంచినీటిగా మార్చమని సవాల్ చేశారు. “నేడు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఏవీ పంట పొలాలకు కానీ, తాగునీటికి కానీ పనికిరావు. ఇప్పుడు చెరువులన్నీ మురికికూపాలుగా మారిపోయాయి. చెరువుల చుట్టుపక్కల ఇళ్లు కట్టుకునేవారు తక్కువ రేటుకు వస్తాయని పాపం అక్కడ ఉంటున్నారు. దోమలు, దుర్గంధం, చెత్త భరిస్తూ అక్కడ ఉన్నారు. అలాంటి సామాన్యుడు కష్టపడి కట్టుకున్న ఇళ్లు ‘నీ తాత జాగీరా కూలగొట్టడానికి’, పేదోళ్ల ఉసురు పోసుకుంటే అంతకంతకూ అనుభవిస్తావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు పేదవాళ్లు కావచ్చు, వాళ్లు కోర్టులకెక్కలేకపోవచ్చు. కానీ వారి కన్నీళ్లు నిన్ను శపిస్తాయి. ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే ముఖ్యమంత్రి కాలేదు. అంతకు ముందు చాలామంది చేశారు. ఇలా ఎవ్వరూ దారుణాలకు పాల్పడలేదు”. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

