నిండుకుండను తలపిస్తోన్న హుస్సేన్ సాగర్
హైదరాబాద్‌లో గత రెండు రోజులు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని హూస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లకు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు భారీగా 3 వేల క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు స్లూయిజ్ గేట్‌తోపాటు ఒక గేటును 2 అడుగుల మేర ఎత్తినట్లు సమాచారం. దీంతో 3,500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతోంది.