Home Page SliderNational

భార్యను హత్య చేసి సూట్‌కేసులో కుక్కిన భర్త

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ షాడిస్ట్ భర్త అతి దారుణంగా భార్యను హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని హుళిమావు సమీపంలో జరిగింది. భార్యను చంపి, ముక్కలుగా నరికి ఆపై సూట్‌కేసులో కుక్కి భర్త రాకేష్ మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తల్లిదండ్రులను పిలిచి నిందితుడు రాకేష్ నేరం ఒప్పుకున్నాడు. మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్‌. ఓ ప్రైవేట్ కంపెనీలో దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది కాలంగా దొడ్డకన్నహళ్లిలో దంపతులు నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డీసీపీ సారా ఫాతిమా పరిశీలించారు. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.